కన్నీరు పెట్టించిన మహిళ ప్రసవ వేదన

ఏజెన్సీలో.. ఎడ్లబండిలో..! మహిళ ప్రసవ వేదన

ఆదిలాబాద్ జిల్లాలో ఓ మహిళ ప్రసవ వేదన కన్నీరు పెట్టించింది. గాది గూడ మండలంలోని లొద్దిగూడ గ్రామానికి చెందిన జంగూబాయికి పురిటి నొప్పులు రావడంతో..డాక్టర్లకు సమాచారం ఇచ్చారు. గ్రామానికి వెళ్లేందుకు రోడ్డు సరిగా లేకపోవడంతో…అంబులెన్స్ ను 3 కిలోమీటర్ల ముందే వదిలి…బైక్ పై వెళ్లి అక్కడే ప్రసవం చేశారు సిబ్బంది. తర్వాత తల్లి బిడ్డను ఎడ్ల బండిలో అడవి నుంచి రోడ్డు వరకు తీసుకువచ్చి..అంబులెన్స్ లో..ఝరీ హాస్పిటల్ కు తీసుకుపోయారు. ప్రస్తుతం జంగుబాయి, పుట్టిన పాప క్షేమంగా ఉన్నట్టు తెలిపారు వైద్య సిబ్బంది.

గతేడాది కూడా ఇలాంటి సంఘటన జిల్లాలో జరిగింది. వర్షాకాలం వాగు పొంగిపొర్లడంతో గిరిజన మహిళ వాగు ఒడ్డున్నే ప్రసవించింది. తర్వాత ఆమెని మంచంపై ఆసుపత్రికి తీసుకుపోయారు. కానీ అప్పటికే పుట్టిన బిడ్ద చనిపోయింది. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు పదేపదే జరుగుతున్నా… రవాణా కోసం కనీస ఏర్పాట్లను అధికారులు చేయడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.