108 వాహనంలో మహిళ డెలివరీ

108 వాహనంలో మహిళ డెలివరీ
  • ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రసవం

కారేపల్లి, వెలుగు: పురిటి నొప్పులు రావడంతో నిండు గర్భిణీని108 వాహనంలో తరలిస్తుండగా మార్గమధ్యలో డెలివరీ అయ్యి పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని పాటిమీదిగుంపు గ్రామానికి చెందిన నున్సావత్ జమునకు నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు108కు సమాచారం ఇచ్చారు. వాహనంలో తీసుకెళ్తుండగా చీమలపాడు గ్రామం దాటిన తర్వాత వాహనంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. క్షేమంగా ఉన్న తల్లీబిడ్డలను108 సిబ్బంది చికిత్స నిమిత్తం కారేపల్లి పీహెచ్ సీకి తరలించారు.