ఇదెక్కడి వింత రోగం.. మద్యం తాగకున్నా కడుపులో తయారవుతుంది

ఇదెక్కడి వింత రోగం.. మద్యం తాగకున్నా కడుపులో తయారవుతుంది

మందు తాగకున్నా.. తాగినట్లే!

ఈరోజుల్లో ఆడమగ అని తేడా లేకుండా మద్యం తాగుతున్నారు. చాలామంది మత్తుకు బానిసలవుతున్నారు. అయితే ఓ వింత వ్యాధి గురించి డాక్టర్లు చెప్పిన విషయం వింటే అందరూ షాక్ అవ్వాసిందే.. అదేంటంటే ఆటో-బ్రూవరీ సిండ్రోమ్‌. కెనడాలోని టొరంటోకి చెందిన 50ఏళ్ల మహిళకు డ్రింక్ చేసే అలవాటు లేదు.. అయినా ఆమెకు మత్తుగా, కళ్లు తిరిగినట్లు, మాట తడబడటం, నోటి నుంచి మద్యం దుర్వాస వంటి లక్షణాలు ఉన్నాయి. ఆమె 7సార్లు హాస్పిటల్ కు వెళ్లినా విషయం బయట పడలేదు. చివరికి ఆమె శరీరంలో లీటర్ రక్తానికి 30 నుంచి 62 మిల్లీ మోల్స్ వరకు ఆల్కహాల్ లెవల్స్ఉన్నట్లు డాక్లర్టు గుర్తించారు.  

నార్మాల్ గా బ్లడ్ లో ఆల్కహాల్ లెవల్స్

ఆమెకు ఆటో బ్రూవరీ సిండ్రోమ్ అంటారు. సాధారణంగా మన శరీరంలో ప్రతి లీటర్ బ్లడ్ కు 2 మిల్లీమోల్స్ (50 మిల్లీగ్రామ్స్) ఆల్కహాల్ ఉంటుంది.  కానీ ఇది కొంతమంది కడుపులో శిలీంధ్రాలు చేసే కిణ్వ ప్రక్రియ ద్వారా ఉండాల్సిన దానికంటే ఎక్కవైతుంది. కార్బోహైడ్రేట్స్, యాంటీబయాటిక్స్ అధికంగా ఉంటే పదార్థాలు అధికంగా తినడం వల్ల ఇలా జరుతుంది. పొత్తికడుపులో జీర్ణ ప్రక్రియ టైంలో ఆల్కహాల్ ఉత్పత్తి చేస్తాయి. అది లీటర్ కు 62 మిల్లీ మోల్స్ కంటే ఎక్కవైతే ప్రాణాలకే ప్రమాదం.

రేర్ సిండ్రోమ్

మనిషి శరీరంలో ఏ ఆల్కహాల్ తాగకున్నా సహాజంగా మన జీర్ణప్రక్రియలో జరిగే కిణ్వ ప్రక్రియ వల్ల కొంత ఆల్కహాల్ ఉత్పత్తి అవుతుంది. ఇది అందరికీ తెలిసిందే.. కానీ ఆటో-బ్రూవరీ సిండ్రోమ్‌ ఉన్నవారికి మోతాదుకు మించి కడుపులో ఆల్కహాల్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇలాంటి ఒక వ్యాధి ఉందని మొదటి సారిగా 1946లో ఆఫ్రికాలో తేలింది. ఐదేళ్ల పిల్లాడు పొట్ట పగిలి చనిపోయాడు. పోస్ట్ మార్టంలో బాలుడి పొత్తికడుపులో డాక్టర్లు నురుగుతో కూడిన ద్రవం గుర్తించారు. 1947 నుంచి ఇప్పటి వరకు ఇటో బ్రూవరీ సిండ్రోమ్ కేసులు 20 బయట పడ్డాయి. ప్రత్యేక టెస్టులు చేస్తేనే ఈ వ్యాధిని గుర్తించవచ్చు.