- మెషీన్ పడిపోతుండగా పట్టుకోబోగా ప్రమాదం
గుండాల, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం గోరకలమడుగులో శుక్రవారం కంకుల మిల్లర్ మీద పడి ఓ మహిళ చనిపోయింది. సీఐ రవీందర్, మృతురాలి భర్త చంద్రయ్య కథనం ప్రకారం..గ్రామానికి చెందిన ఈసం రమణ( 36)కు చెందిన కంకుల మిల్లర్‌ను చేను నుంచి ట్రాక్టర్‌కు కట్టి డ్రైవర్ తీసుకువెళ్తున్నాడు. దీని వెనక రమణ నడిచి వెళ్తోంది.
అడవిలో డౌన్ ఉన్న దగ్గర మెషీన్ఓవైపు ఒరిగి పల్టీ కొట్టబోతుండగా రమణ రెండు చేతులు పెట్టి ఆపే ప్రయత్నం చేసింది. బరువు ఎక్కువగా ఉండడంతో మిల్లర్ మీద పడి అక్కడికక్కడే చనిపోయింది. మృతురాలికి కొడుకు, కూతురు ఉన్నారు. కాచనపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.