
కొడిమ్యాల,వెలుగు: అత్తింటి వేధింపులతో మహిళ ఆత్మహత్య చేసుకున్న ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. ఎస్ఐ సందీప్ తెలిపిన ప్రకారం.. కొడిమ్యాల మండల కేంద్రానికి చెందిన దుబ్బాక రాహుల్ కు అదే మండలం బుగ్గారం గ్రామానికి చెందిన జమున(26)తో గతేడాది పెండ్లి అయింది. గత ఆరు నెలలుగా జమునను భర్త రాహుల్, మామ నారాయణ అదనపు కట్నం కోసం వేధిస్తున్నారు. దీంతో ఆమె ఈనెల 21న ఇంట్లో ఫినాయిల్ తాగి చీరతో ఉరేసుకుంది.
వెంటనే కుటుంబ సభ్యులు జగిత్యాలలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి చనిపోయింది. అత్తింటి వేధింపులతోనే తమ కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి కొమ్ము పోషవ్వ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.