హెల్మెట్ కొందామని ఆగితే .. ప్రాణం పోయింది

  • బైక్​ను కారు ఢీ కొనడంతో మహిళ మృతి
  • మరో ఇద్దరికి తీవ్రగాయాలు

ఇబ్రహీంపట్నం, వెలుగు: రక్షణ కోసం హెల్మెట్​కొందామని బైక్​ను రోడ్డుపై ఆపగా, వెనక నుంచి కారు ఢీ కొట్టడంతో మహిళ మృతి చెందింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఇబ్రహీంపట్నం సీఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. నల్గొండ జిల్లా నాంపల్లి మండలం దేవతపల్లికి చెందిన పొల్లెపాక సాయిలు తన భార్య రాములమ్మ(35), కొడుకుతో కలిసి బైక్​పై హైదరాబాద్ ​నుంచి సోమవారం స్వగ్రామానికి బయలుదేరారు.

 ఇబ్రహీంపట్నం మండలం మంగల్​పల్లి గేట్​ సమీపంలో రోడ్డు పక్కన ఉన్న దుకాణంలో హెల్మెట్ కొందామని​ఆగారు. ఈ క్రమంలో వారిని వెనక నుంచి కారు ఢీ కొనడంతో రాములమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో సమీప ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్​ను ఇబ్రహీంపట్నానికి చెందిన ​ప్రభుత్వ టీచర్ శంకర్​గా పోలీసులు గుర్తించారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.