
గచ్చిబౌలి, వెలుగు: ప్రియుడు పెండ్లికి నిరాకరించడంతో బిల్డింగ్‌నుంచి దూకి యువతి సూసైడ్ చేసుకుంది. రాయదుర్గం ఎస్ఐ రాములు వివరాల ప్రకారం.. అస్సాంకు చెందిన సుల్తానా బేగం(26) బతుకుదెరువు కోసం సిటీకి వచ్చింది. గచ్చిబౌలిలోని అంతేరా కిచెన్అండ్బార్లో పనిచేస్తూ సిద్ధిక్‌నగర్‌లోని అంతేరా లేబర్క్యాంపులో నివాసం ఉంటోంది. గతంలో నవాబ్ హోటల్లో పనిచేస్తున్న సమయంలో ఆమెకు హోటల్మేనేజర్కోల్ కత్తాకు చెందిన సాహిదుల్ షేక్(29)పరిచయమయ్యాడు.
గత మూడేండ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. సుల్తానాబేగం ఇంట్లో పెండ్లి సంబంధాలు చూస్తుండడంతో తనను పెండ్లి చేసుకోవాలని సాహిదూల్పై ఒత్తిడి తీసుకువచ్చింది. ఇదే విషయమై కొద్దిరోజులుగా వీరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. గురువారం తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో సుల్తానా ఫోన్ నంబర్‌ను సాహిదుల్ బ్లాక్ చేశాడు.
దీంతో సుల్తానా తన ఫ్రెండ్ఫోన్నుంచి అతడికి కాల్చేసి పెండ్లి చేసుకోకపోతే మీ బిల్డింగ్‌పై నుంచి దూకి చనిపోతానని చెప్పింది. స్పందించకపోవడంతో సుల్తానా అంజయ్యనగర్బంజారా బస్తీలోని సాహిదుల్ నివాసం ఉంటున్న బిల్డింగ్ఆరో ఫ్లోర్‌లోని పెంట్హౌజ్పైకి చేరుకొని తెల్లవారుజామున 5 గంటల సమయంలో కిందకు దూకింది. బిల్డింగ్‌నుంచి కారుపై పడడడంతో సుల్తానా తల, చేతులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
భారీ శబ్ధం రావడంతో ఉలిక్కపడ్డ స్థానికులు బయటకు వచ్చి చూడగా సుల్తానా బేగం రక్తపుమడుగులో కనిపించింది. వెంటనే సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి, అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం పంజాగుట్టలోని నిమ్స్ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. మృతురాలి బంధువు మహ్మద్సుల్తాన్ఫిర్యాదుతో రాయదుర్గం పోలీసులు యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.