ఇంత చిన్నదానికేనా తల్లీ : పార్లర్ కు వద్దన్నాడని.. ప్రాణం తీసుకున్న భార్య

ఈ రోజుల్లో చిన్నచిన్న విషయాలకే మనస్తాపం చెంది తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. పరీక్షల్లో ఫెయిల్​ అయ్యామని... ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోలేదని... భార్యపై కోపంతో.. భర్త.. భర్త ఏదో అన్నాడని భార్య బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.  తాజాగా భార్యను బ్యూటీప్లార్లర్​కు వెళ్లొద్దన్నాడని..  ఆమె ఉరేసుకొని  ఆత్మహత్యకు పాల్పడిన ఘటన  మధ్యప్రదేశ్  చోటుచేసుకుంది.  ఇండోర్ జిల్లాలో బ్యూటీ పార్లర్​ కు  వెళ్లేందుకు భర్త నిరాకరించడంతో 34 ఏళ్ల మహిళ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు శనివారం  (ఏప్రిల్ 29) తెలిపారు. ఈ సంఘటన నగరంలోని ఏరోడ్రోమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం (ఏప్రిల్​ 27) చోటుచేసుకుంది. ఆ మహిళను స్కీం-51లో నివాసముంటున్న రీనా యాదవ్ గా  గుర్తించారు. రీనా యాదవ్​ అనే మహిళకు బలరామ్ యాదవ్ తో  15 ఏళ్ల క్రితం వివాహమైందని విచారణ అధికారిఎస్సై  ఉమా శంకర్ యాదవ్ తెలిపారు. గురువారం (ఏప్రిల్ 27) బ్యూటీ పార్లర్​ కు  వెళ్లాల్సిందిగా బలరామ్ ను అడగ్గా   అతడు నిరాకరించాడు. దీంతో ఆమె మనస్థాపం చెంది  బ్యూటీపార్లర్ కు  వెళ్లకుండా అడ్డుకున్నాడని, ఆవేశంతో ఫ్యాన్ కు  ఉరివేసుకుని చనిపోయింది.  బలరామ్ ఇంటికి వచ్చినప్పుడు, ఆమె ఉరివేసుకుని ఉన్నట్లు గుర్తించి, విషయం గురించి పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఈ  కేసును అన్ని కోణాల్లోనూ విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.