నర్సంపేట, వెలుగు : పాముకాటుతో ఓ మహిళ చనిపోయింది. ఈ ఘటన వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరంలో బుధవారం జరిగింది. మహేశ్వరం గ్రామానికి చెందిన బండి మానస(29)ను బుధవారం ఇంట్లో కట్ల పాము కరిచింది.
వెంటనే కుటుంబ సభ్యులకు విషయం చెప్పడంతో నర్సంపేట జిల్లా హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి వరంగల్ ఎంజీఎంకు రెఫర్ చేశారు. అక్కడ ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మానస చనిపోయింది.