ఐదేళ్ల తర్వాత భర్త రహస్యం తెలుసుకున్న భార్య ఏం చేసిందంటే..

తాను మోసపోయానంటూ పోలీసులకు ఫిర్యాదు

చెన్నై: ఇంటర్నెట్‌లోని మాట్రిమోనియల్ లో పెళ్లి సంబంధం చూసి ఎర్రగా.. బుర్రగా కనిపించిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది ఓ మహిళ. ఐదేళ్లు సజావుగానే కాపురం సాగింది. అయితే కొద్ది రోజుల క్రితం భర్త ఒంటరిగా గదిలోకి వెళ్లి తలుపులేకుంటే ఏం చేస్తున్నాడోనన్న అనుమానంతో చాటుగా భర్తను చూసి షాక్ కు గురైంది. ఐదేళ్లుగా భర్త అసలు రూపం గుర్తించలేకపోయానని కుమిలిపోయింది. భరించలేక చివరకు పోలీసులను ఆశ్రయించిన ఘటన చెన్నై నగరంలోని అలప్పాకంలో జరిగింది. 2015లో అలప్పాకం నివాసి అయిన రాజశేఖర్ ఫోటో మాట్రిమోనియల్ సైట్ లో చూసి ఇరువైపులా తల్లిదండ్రులు పెళ్లి చూపులు ఏర్పాటు చేశారు. పెళ్లి చూపుల సమయంలో బట్టతల ఉన్న రాజశేఖర్ విగ్ పెట్టుకుని రావడంతో చాలా అందంగా కనిపించాడు. దీంతో పెళ్లికూతురు తరపువారు 2 లక్షల చిలుకు నగదు, 50 సవర్ల బంగారం ఇతర లాంఛనాలు కట్నంగా ఇచ్చి పెళ్లి జరిపించారు. పెళ్లిలో కూడా రాజశేఖర్ తన బట్టతల కనిపించకుండా సహజమైన వెంట్రుకలున్న విగ్ నే పెట్టుకోవడంతో ఎవరూ గుర్తుపట్టలేకపోయారు. దీంతో రాజశేఖర్ అదే విగ్ ను జాగ్రత్తగా మెయిన్ టెయిన్ చేసుకుంటూ వస్తున్నాడు. కొద్ది రోజుల క్రితం తన భార్య గుర్తుపట్టడంతో కుటుంబంలో కలతలు మొదలయ్యాయి. తరచూ వాగ్వాదాలు జరుగుతుండడంతో వివాహిత భరించలేకపోయిన వివాహిత తిరుమంగళం పోలీసులను ఆశ్రయించింది. తాను మోసపోయానని… కట్నకానుకల కింద ఇచ్చిన నగదు, నగలతోపాటు లాంఛనాలు తిరిగి ఇప్పించాలని డిమాండ్ చేసింది. మోసగాడైన భర్తతో కాపురం చేయలేనంటూ విడాకులకు దరఖాస్తు చేసుకుంది. తనను మోసం చేసిన అత్తమామలు, ఆడపడుచు కూడా తనపై దాడి చేసి హింసించారని, వారిపై కూడా చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ కూడా చదవండి..

బైకుపై 5 ఖండాల్లో 37 దేశాలు చుట్టొచ్చాడు..కానీ

పెనుకొండలో ప్రత్యక్షమైన వింతపక్షి

ప్రతి ఇంటికి ఉచితంగా ఇంటర్నెట్.. సగం ధరకే లాప్‌టాప్

గాలిపటం కోసం పరిగెడుతూ..పెంటకుప్పలో పడి బాలుడి మృతి