ఇటీవల పార్ట్ టైమ్ జాబ్ పేరిట ఆన్లైన్ మోసాలు పెరిగిపోతున్నాయి. ఆన్లైన్ మోసాల పట్ల పొలిసు శాఖ ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేస్తున్నప్పటికీ ఈజీ మనీ కోసం అత్యాశకు పోతున్న జనం కేటుగాళ్లకు చిక్కుతూనే ఉన్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో మరో మహిళ పార్ట్ టైమ్ జాబ్ పేరిట వచ్చిన వాట్సాప్ మెసేజ్ కు బలయ్యింది. పార్ట్ టైమ్ జాబ్ అంటూ వచ్చిన మెసేజ్ లో లింక్ ను క్లిక్ చేసి రూ. 4.72 లక్షలు మోసపోయింది ఓ మహిళ.
తక్కువ పెట్టుబడితో ఎక్కువ రిటర్న్స్ అంటూ మెసేజ్ పంపి మహిళ అకౌంట్లో ఉన్న సొమ్మును కాజేశారు మోసగాళ్లు. తన సొమ్మును కోల్పోయిన మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించటంతో విషయం వెలుగులోకి వచ్చింది. మొదట కొంత మొత్తానికి రిటర్న్స్ ఇచ్చిన నేరగాళ్లు ఆ తర్వాత మహిళ నుండి రూ. 4.72లక్షలు కాజేశారని ఫిర్యాదులో పేర్కొంది మహిళ.