
- మంచిర్యాల జిల్లా ఇటిక్యాలలో ఘటన
లక్సెట్టిపేట, వెలుగు: ఇంట్లో వాటర్ హీటర్ పెడుతూ ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మహిళ మృతిచెందిన ఘటన మంచిర్యాల జిల్లాలో జరిగింది. ఎస్ ఐ సతీశ్ తెలిపిన ప్రకారం.. లక్సెట్టిపేట మండలం ఇటిక్యాల గ్రామానికి చెందిన గంధం తిరుమల(42) ఆదివారం ఇంట్లో స్నానానికి వేడి నీళ్ల కోసం బకెట్ లో హీటర్ పెడుతుండగా ప్రమాదవశాత్తు షాక్ కొట్టి స్పాట్ లో చనిపోయింది. మృతురాలికి భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె తల్లి భాగ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు.