
ఓ వ్యక్తి తన భార్యను దారుణంగా హత్య చేసి పరారయ్యాడు. ఈ సంఘటన హైదరాబాద్ లోని నేరేడ్ మెట్ లో చోటుచేసుకుంది. మహేందర్ అనే వ్యక్తి తన భార్య స్రవంతితో కలిసి నేరెడ్ మెట్ పరిధిలోని సమతా నగర్ లో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో భార్యతో గొడవ పడిన మహేందర్.. ఆమెను దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి తాళం వేసి అక్కడి నుంచి పరారయ్యాడు.
మృతురాలి సోదరుడి సమాచారం మేరకు పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ అస్పత్రికి తరలించారు. కుటంబ కలహాలతో భార్య స్రవంతిని మహేందర్ హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.