హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాలింత మృతి

హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బాలింత మృతి

ఆర్మూర్, వెలుగు: డెలివరీ తర్వాత ఓ బాలింత చనిపోయింది. ఇందుకు డాక్టర్లే కారణమంటూ మృతురాలి బంధువులు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనశుక్రవారం ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పట్టణంలో జరిగింది. నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా ఆలూర్ మండలం కల్లెడ గ్రామానికి చెందిన పిట్ల సుమలత (25) డెలివరీ కోసం గురువారం ఆర్మూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని శ్రీ తిరుమల హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో అడ్మిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయింది. 

సుమలతకు రాత్రి సర్జరీ చేయడంతో మగబిడ్డ పుట్టాడు. ఆ తర్వాత హార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బీట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పెరిగడంతో సుమలత చనిపోయింది. అయితే సుమలతకు గతంలో రెండు కాన్పులు నార్మల్ డెలివరీ అయ్యాయని, ప్రస్తుతం సర్జరీ చేయడం వల్లే ఆమె చనిపోయిందంటూ బందువులు హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎదుట మెయిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రోడ్డుపై రాస్తారోకోకు దిగారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, డాక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. 

రాస్తారోకోతో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇబ్బందులు తలెత్తడంతో విషయం తెలుసుకున్న సీఐ రవికుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ హాస్పిటల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్దకు వచ్చి బాధిత కుటుంబీకులతో మాట్లాడారు. ఏదైనా ఉంటే శాంతియుతంగా మాట్లాడుకోవాలని రోడ్డుపై ఆందోళనకు దిగితే ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని నచ్చజెప్పారు. ఆ తర్వాత మృ-తురాలి కుటుంబ సభ్యులు డాక్టర్లతో మాట్లాడి అక్కడి నుంచి వెళ్లిపోయారు.