జగిత్యాల జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో కోడల్ని దారుణంగా హత్య చేశాడో మామ. సారంగపూర్ మండలం రేచపల్లికి చెందిన మౌనికను ... మామ మటన్ కొట్టే కత్తితో మెడ వెనుక భాగంలో కోసి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం కోసం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
కాగా మౌనిక భర్త విదేశాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. మృతురాలికి ఇద్దరు కుమార్తెలున్నారు. హత్యకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు పోలీసులు.