- ఇద్దరి మృతి.. చైనాలో ఘటన
బీజింగ్: తూర్పు చైనాలో దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ప్రైమరీ స్కూళ్లోకి ప్రవేశించి కత్తితో దాడికి పాల్పడింది. దీంతో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. మరో 10 మంది గాయాలపాలయ్యారు. జియాంగ్జి ప్రావిన్స్ లోని గుయిక్సీ సిటీలో సోమవారం ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్‌కు చేరుకొని 45 ఏండ్ల నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు.
గాయపడిన వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వారిలో ఆరుగురు స్వల్పంగా, నలుగురు తీవ్రంగా గాయపడినట్టు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు వారు వెల్లడించారు. చైనాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం ఈ నెలలో ఇది రెండోది.