
తన భూమికి పట్టా ఇవ్వాలని ఎమ్మార్వో కాళ్లపై పడింది ఓ మహిళ. తనకు పట్టా ఇప్పించాలని కన్నీళ్లుపెట్టుకుంది. ఈ ఘటన ఖమ్మం జిల్లా వేంసూరు తహశీల్దార్ కార్యాలయంలో జరిగింది. అమ్మపాలెం గ్రామానికి చెందిన ఒంటరి మహిళ నాగమణి.. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఎకరం భూమిని పట్టాచేయాలని కోరింది.
ఎన్నో ఏండ్లుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఫలితం దక్కలేదు. ఇవాళ MRO కాళ్లపై పడి కన్నీళ్లు పెట్టుకుంది. ఎకరం భూమిలో తాను సాగు చేసుకుంటున్నట్లు ఎమ్మార్వోకు చెప్పింది. పరిశీలించి న్యాయం చేస్తామని తహశీల్దార్ హామీ ఇచ్చారు.