రాజన్న సిరిసిల్ల: సిరిసిల్లలో మాజీ మంత్రి కేటీఆర్ కు చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల పరిధిలోని పెద్దూరు శివారు ప్రాంతంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండ గా..ఓ మహిళా రైతు మెడికల్ కాలేజీకి ఇచ్చిన వ్యవసాయ భూములపై ప్రశ్నించారు. మెడికల్ కాలేజీకోసం తీసుకున్న వ్యవసాయ భూములను తిరిగి తమకు అప్పగిం చాలని నిలదీశారు. డబుల్ బెడ్ రూం ఇస్తా అన్నవ్ ఇంకెప్పుడు ఇస్తారు అని ప్రశ్నించారు
మాభూములు తీసుకున్నరు.. మేం రందికి సచ్చిపోతున్నాం అంటే మహిళ అనగానే రంది పడకండి .. కలెక్టర్ తో మాట్లాడి తిరిగి మీ జాగా ఇప్పించే బాధ్యత నాది.. ఫ్లాట్ కూడా వచ్చేలా చూస్తానని టెన్షణ్ పడొద్దని చెబుతుందగానే.. ఇంకెపుడు ఇస్తరు అని మహిళ బోనాల లక్ష్మీ నీలదీశారు. మార్కెట్లో సౌలతులు సక్కగా లేు..దొంగలు, లంగలు వస్తున్నారు మమ్మల్ని బెదిరిస్తున్నారని కేటీఆర్ కు చెప్పి మహిళ వాపోయారు.
సిరిసిల్లలోని స్థానిక రైతు బజార్ లేబర్ అడ్డా, గాంధీ చౌక్లో మాజీ మంత్రి కేటీఆర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్లో కూరగాయలు అమ్ముకునే రైతులు పలు సమస్యలను కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. తాగునీరు, ఎండ ఎక్కువగా ఉంది మార్కెట్లో చలువ పందిర్లు వేయించాలని కోరగా 24 గంటల్లో ఏర్పాటు చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
కేసీఆర్ ఉన్నపుడే బాగుండేది.. అప్పుడు నీళ్లు కరెంట్ సక్కగా వచ్చేది అని స్థానిక ప్రజలు కేటీఆర్ తో చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం పోయిన తర్వాత నీళ్లు రావడం లేదు.. నెలకు ఫించన్ కూడా రావడం లేదని చెప్పారని కేటీఆర్ అన్నారు.కొత్త ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని అన్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ ఎస్ కు ఓటు వేసి గెలిపించుకుంటామని తెలిపారని కేటీఆర్ అన్నారు.