తగ్గేదేలా:ఢిల్లీ మెట్రోలో..సీటు ఇవ్వలేదని మగాడి ఒడిలో కూర్చున్న మహిళ

ఢిల్లీ మెట్రో.. చిత్ర, విచిత్రాలకు ఐకాన్.. రీల్స్, షార్ట్స్ కు పెట్టింది పేరు.. లేటెస్ట్ గా ఢిల్లీ మెట్రోలో జరిగిన ఇన్సిడెంట్ మాత్రం ఆసక్తిగా మారింది. మెట్రో రైలు ఎక్కిన మహిళకు సీటు దొరకలేదు.. అలా అని అది లేడీస్ స్పెషల్ బోగీ కాదు.. దీంతో ఆ మహిళ కోసం ఎవరూ సీటు ఇవ్వలేదు.. అటూ ఇటూ చూసిన మహిళకు ఎవరూ సీటు ఇవ్వకపోవటంతో.. తానే తెగించేసింది. సీటు ఇవ్వాలని డిమాండ్ చేసింది. నో అన్నారు మగ ప్రయాణికులు. దీంతో ఆ మహిళ.. సీటులో కూర్చున్న ఓ పురు షుడి ఒడిలోనే కూర్చున్నది.. నీకు సిగ్గు లేకపోతే ఏంటీ అంటూ కామెంట్ చేయటం విశేషం. ఆ మహిళ చర్యతో అందరూ షాక్ అయ్యారు. పక్కనే ఉన్న ఓ మగ ప్రయా ణికుడు.. సీటు ఖాళీ చేసి నిల్చోవటం కనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళితే...

Also Read:రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్: 20రూపాయలకే భోజనం... 

ఈ వివాదాస్పద వీడియోలో ఢిల్లీ లో మెట్రోలో ప్రయాణిస్తున్న బ్లాక్ డ్రస్ ధరించిన ఓ మహిళ తోటి ప్రయాణికులతో వాగ్వాదానికి దిగుతున్నట్లు కనిపిస్తుంది. ఆమె సీటు దొరక్కపోవడం కొంత అసహనానికి గురైన ఆ మహిళ సీటు ఇవ్వమని ఓ యువకుడిని అడగ్గా తిరస్కరించాడు. ఇలా అందరిని అడిగింది.. ఎవరూ సీటు ఇవ్వకపోవడంతో ఓ యువకుడి తొడపై కూర్చుంది. పైగా సిగ్గు లేదా అని కామెంట్ చేసింది. ఇదంతా చూసిన మరో యువకుడి మరో మార్గం లేక సీటు నుంచి లేచి ఆమెకు ఇచ్చాడు. 

ఎప్పుడు జరిగిందో ఖచ్చితంగా తెలియదు గానీ ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆ యువతి చేసిన వింత చేష్టలకు నెటిజన్లు మండిపడు తున్నారు. ఎప్పుడు ఏం జరుగుందోనని వణికిపోతున్నారు. మెట్రోలో ప్రయాణం అంటే ఆందోళన చెందుతున్నారు. మహిళలు ఈ రోజుల్లో ఎంత దిగజారిపోతు న్నారో అని ఆవేదన చెందుతున్నారు.