ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలు

  • భద్రాచలం ఏరియా దవాఖానలో డెలివరీ 
  • ఇప్పటికే ఏడుగురు సంతానం 
  • అన్నీ సాధారణ ప్రసవాలే...

భద్రాచలం,వెలుగు: చత్తీస్​గఢ్​కు చెందిన ఓ మహిళ ఒకేసారి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఏరియా దవాఖానలో బుధవారం హెడ్​నర్స్ 
విజయశ్రీ ఆధ్వర్యంలో సిబ్బంది సాధారణ కాన్పు చేశారు. ఆ మహిళకు ఇది 8వ కాన్పు. బీజాపూర్ జిల్లా ఊసూరు బ్లాక్​ బట్టిగూడెం గ్రామానికి చెందిన పొజ్జి ( 28) ఈనెల 2న కాన్పు కోసం ఏరియా దవాఖానలో జాయిన్​అయ్యింది. బుధవారం నొప్పులు రావడంతో మిడ్​వైఫ్ విభాగంలో సాధారణ ప్రసవం చేశారు. 

ఇద్దరు మగ, ఒక ఆడ శిశువు పుట్టారు. ముగ్గురూ ఆరోగ్యంగానే ఉన్నారని పిల్లల డాక్టర్​రాజశేఖర్, సూపరింటెండెంట్​ డా.రామకృష్ణ  తెలియజేశారు. కాగా, పొజ్జికి గత ఏడు కాన్పుల్లో నలుగురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు పుట్టారు. అవన్నీ కూడా    సాధారణ ప్రసవాలే.