
ఒకప్పుడు పాటలు వినాలంటే రేడియోలో వీధిభారతి ప్రోగ్రాం వినే వాళ్లం.. ఆ తరువాత టేపురీ కార్డ్ క్యాసెట్ల ద్వారా మనకు కావలసిన పాటలు వినేవాళ్లం. ఆ తరువాత సాంకేతికంగా డెవలప్ అయిన తరువాత సీడీల యుగం వచ్చింది. ఇక ఇప్పుడు సెల్ ఫోన్లలో వింటున్నాం.. ఒకప్పుడు సీడీలకు ఎంతో క్రేజ్ ఉండేది.. ఆడియో.. వీడియోలనుకూడా సీడీల ద్వారా ఆస్వాదించేవాళ్లం. అయితే ఇప్పుడు సీడీలను ఎవరూ వాడటం లేదు. ఒక వేళ ఉన్నా వాటిని బయటపడేస్తున్నాం. కాని ఓ మహిళ అలాంటి సీడీలతో అద్భుతాలను సృష్టించి ఔరా అనిపివచుకుంది.
సోషల్ మీడియా వచ్చిన కొంతమంది జనాలు అద్భుతాలు సృష్టిస్తుంటే.. మరికొందరు వెర్రి పనులు చేసి వైరల్ అవుతున్నారు. కాని ఓ మహిళ సీడీలతో వంటకాన్ని తయారు చేసింది. అది తినేదనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఓ మహిళ సీడీలను నూనెలో వేయించి అద్భుతం సృష్టించిన వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో సలసలకాగే నూనెలో సీడీలను పకోడీల మాదిరిగా వేయించింది. ఆ తరువాత వాటిని అందంగా తనకు కావలసిన షేప్ లో కట్ చేసింది. గమ్ తో అతికిస్తూ.. అందమైన మధ్య మధ్యలో పూసలు పెట్టి అందమైన హ్యాంగింగ్ ను తయారు చేసింది. ఇది పాత సీడీలతో తయారు చేశారంటే ఎవరూ నమ్మడం లేదు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
వీడియో ప్రారంభంలో పాత సీడీలను వేడి నూనెలో వేయించినప్పుడు జనాలు ఆశ్చర్యపోయారు. ఈమహిళ సీడీలతో ఏమి ఫుడ్ ఐటం తయారు చేస్తుందరా బాబూ అని భయపడ్డారు. కానీ ఆ మహిళ కళా నైపుణ్యంతో వేయించిన సీడీలతో బ్యూటీఫుల్ వాల్ హ్యాంగింగ్‌లను తయారు చేసింది. సహజంగా భారతదేశ ప్రజల టాలెంట్ ను మొదట్లో ఎవరూ గుర్తించరు కదా మరి. ఈ వీడియోను ఇన్ స్ట్రాగ్రామ్ లో షేర్ చేశారు. ఇప్పటి వరకు ( వార్త రాసే సమయం) మిలియన్ల మంది వీక్షించారు. ఇది చాలా ప్రత్యేకమైనదని కామెంట్ చేశారు.