మధ్యప్రదేశ్‌లోని చింద్వారా జిల్లాలో ఓ గర్భిణీ రోడ్డుపైనే ప్రసవించింది. దానికి కారణం ఆ గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేకపోవడమే. గుర్లుదాన గ్రామంలో ఓ గర్భిణీకి పురిటినొప్పులు వచ్చాయి. అంబులెన్స్ కు ఫోన్ చేయగా సరైన రోడ్డు మార్గం లేక 2 కి.మీ అవతలే ఆగిపోయింది. ఏమిచేయలేని స్థితిలో కుటుంబసభ్యులు సదరు గర్భిణీని మంచంపై అంబులెన్స్ వద్దకు తీసుకెళ్తుండగా మార్గమధ్యలోనే ఆమె ప్రసవించింది. ప్రసవం తర్వాత తల్లిబిడ్డలను అదే మంచంపై అంబులెన్స్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడి నుండి అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డలు క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.
మరిన్ని వార్తల కోసం