ఒకే కాన్పులో.. ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది ఛత్తీస్ఘడ్ కు చెందిన ఓ మహిళ.. ఈ ఘటన ఖమ్మం జిల్లాలోని భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చోటుచేసుకుంది. ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా ఉసూరు మండలం భట్టిగూడెం గ్రామానికి చెందిన ఊకె పోజ్ఞా అనే మహిళకు నొప్పులు రావడంతో 2023 జూలై 2వ తేదీన భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు.
2023 జూలై 05 వ తేదీన ఆ మహిళ ఒకే కాన్పులో ఇద్దరు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల జన్మించింది. తల్లి పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారు. మగ శిశువులు 1.8 కిలోలు, 1.75 కిలోలు బరువు ఉండగా.. ఆడ శిశువు 1.5 కిలోల బరువు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అయితే ఆమెకు ఇది ఎనిమిదో కాన్పు కాగా అంతకుముందే ఏడుగురు పిల్లలున్నారు. తాజాగా పుట్టిన పిల్లలతో ఆ సంఖ్య 10కి చేరుకుంది.