సెన్సేషన్ జడ్జ్‌మెంట్: తప్పుడు రేప్ కేసు పెట్టిన మహిళకు తగిన బుద్ధి చెప్పిన కోర్టు

సెన్సేషన్ జడ్జ్‌మెంట్: తప్పుడు రేప్ కేసు పెట్టిన మహిళకు తగిన బుద్ధి చెప్పిన కోర్టు

బరేలీ అడిషనల్ కోర్టు శనివారం ఓ విలక్షణమైన కోర్టు తీర్పు ఇచ్చింది. మహిళ తప్పుడు సాక్ష్యంతో ఓ వ్యక్తి నాలుగేళ్లు జైలులో మగ్గాడు. ఈమధ్యకాలంలో కొందరు ఆడవాళ్లు ఇండియాలో వాళ్లకు అనుకూలంగా ఉన్న చట్టాలను వాడుకొని రాజకీయ నాయకులను, బిజినెస్ మ్యాన్లలు బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. అత్యాచార ఆరోపణలతో కేసులు పెట్టి బెదిరించి అందిన కాడికి డబ్బు లాగుతున్నారు. 

అజయ్ కుమార్ అలియాస్ రాఘవ్ తనతోపాటు ఆఫీస్ లో పనిచేసే వ్యక్తి సోదరిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. కావాలనే కక్ష్యతో ఆమె తన15 ఏళ్ల కూతరిని కిడ్నాప్ చేసి అత్యాచారం చేశాడని తప్పుడు సాక్ష్యాలు చూపించి 2019లో అజయ్ కుమార్ ని జైలుకు పంపింది. పోక్సో చట్టం కింద అమాయకుడైన అజయ్ కుమార్ 1653 రోజులు జైలు జీవితాన్ని అనుభవించాడు. 

మే4న (శనివారం) బరేలీ సెషన్స్ కోర్టులో ఆమె తప్పుడు సాక్ష్యం చెప్పినట్లు నిర్ధారణ అయింది. డబ్బు కోసమే నిధితులకు అనుకూలంగా ఆమె స్టేట్ మెంట్ మార్చిందని కోర్టు సీరియస్ అయింది. జస్టిస్ ఏడీజే జ్ఙానేంద్ర త్రిపాఠి ఆమెపై ఐపీసీ 195 సెక్షన్ కింద కేసు నమెదు చేసింది.. అంతేకాదు అమాయకుడైన అజయ్ ఎన్ని రోజులైతే చేయని తప్పుకు శిక్ష అనుభవించాడో అన్ని రోజులు (1653 రోజులు) జైలు శిక్షతోపాటు రూ.5.9 లక్షల ఫైన్ ఆమెకు విధించారు. నాలుగేళ్ల తర్వాత అజయ్ నిర్ధోషి అని కోర్టుకు తేల్చింది.  ఇండియన్ చట్టాలు మహిళలకు సంబంధించిన ఫిర్యాదులపై కఠిన చర్యలు తీసుకుంటుందని.. అవి అనవసరంగా ఉపయోపయోగిస్తే  పురుషుల హక్కులపై ఎఫెక్ట్ పడుతుందని కోర్టు తెలిపింది.