అమెరికాలో భారత సంతతి మహిళ దారుణం
మర్డర్ అటెంప్ట్ కేసు నమోదు
న్యూయార్క్: అమెరికాలో ఉంటున్న భారత సంతతి మహిళ దారుణానికి పాల్పడింది. బాత్ రూమ్ లో బిడ్డకు జన్మనిచ్చిన ఆమె.. ఆ వెంటనే కిటికీలో నుంచి బిడ్డను బయటకు విసిరేసింది. ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఆమెపై మర్డర్ అటెంప్డ్ కేసు నమోదైంది. సబితా దూక్రమ్ (23) న్యూయార్క్ లోని క్వీన్స్ లో ఉంటోంది. శనివారం స్నానం చేస్తున్న టైమ్ లో ఆమెకు మగబిడ్డ పుట్టాడు. సబిత భయంతో ఆ బిడ్డను బాత్ రూమ్ లోని కిటికీలో నుంచి బయటకు విసిరేసింది. పిల్లాడి ఏడుపులు విన్న పక్కింటోళ్లు పోలీసులకు సమాచారం అందజేయడంతో అసలు విషయం బయటపడింది. తీవ్రగాయాలైన పిల్లాడిని హాస్పిటల్ లో చేర్పించామని, కండిషన్ సీరియస్ గా ఉందని పోలీసులు తెలిపారు. వెంటిలేటర్ పై ఉంచి ట్రీట్ మెంట్ అందజేస్తున్నారని చెప్పారు. ‘‘అసలు నాకు ప్రెగ్నెన్సీ అయినట్టే నేను గుర్తించలేదు. స్నానం చేస్తున్న టైమ్ లో నాకు డెలివరీ అయింది. ఏం చేయాలో అర్థం కాలేదు. భయంతో ఆ బిడ్డను బాత్ రూమ్ కిటికీలో నుంచి బయట పడేశాను. బట్టలు ఉతికేసి స్నానం చేసి పడుకున్నాను. నన్ను క్షమించండి” అని సబిత పోలీసుల విచారణలో ఒప్పుకుంది. ఆమెపై మర్డర్ అటెంప్ట్ కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.
For More News..