భూకంప బీభత్సం..బ్యాంకాక్ వీధుల్లో..బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

భూకంప బీభత్సం..బ్యాంకాక్ వీధుల్లో..బిడ్డకు జన్మనిచ్చిన మహిళ

వరుస భూకంపాలు మయన్మార్, థాయ్ లాండ్ను కుదిపేశాయి. భూకంపం ధాటికి పెద్దపెద్ద భవనాలతో సహా అనేక నిర్మాణాలను నేలమట్టమయ్యాయి. దాదాపు వెయ్యి మంది ప్రాణాలు కోల్పోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. వేలాది మంది నిరాశ్రయులయ్యారు. భూకంపం ధాటికి ఏడంతస్తుల ఆస్పత్రికి కూడా కుప్పకూలింది. దీంతో రోగులకు చికిత్స ఓ పార్కుల్లో చికిత్స అందిస్తున్నారు. పార్కులోనే స్ట్రెక్చర్పై ఓ మహిళ బిడ్డకు జన్మనిచ్చింది. 

శుక్రవారం మయన్మార్, థాయిలాండ్ లోని కొన్ని ప్రాంతాల్లో భారీ భూకంపం బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. భూకంపం కారణంగా బ్యాంకాక్ లోని ఓ ఆస్పత్రిని ఖాళీ చేయించారు. ఈ క్రమంలో ఓ మహిళ వీధిలో శిశువుకు జన్మనిచ్చింది. ఈ సంఘటన కెమెరాలో రికార్డైంది. భూకంపం వల్ల కలిగే విధ్వంసం మధ్య శిశువు జన్మించిన నాటకీయ దృశ్యాలు ఆన్‌లైన్‌లో వైరల్ అవుతున్నాయి. 

ఆ మహిళ వీధుల్లో ఆసుపత్రి స్ట్రెచర్‌పై ప్రసవించింది. ఆసుపత్రి సిబ్బంది తల్లిని చుట్టుముట్టి ప్రసవానికి సహాయం చేస్తున్నట్లు వీడియోలో కనిపిస్తుంది. భారీ భూకంపం తర్వాత కింగ్ చులాలాంగ్‌కార్న్ మెమోరియల్ హాస్పిటల్, BNH హాస్పిటల్ నుంచి రోగులను సమీపంలోని పార్కుకు తరలించారు.  వైద్యులు,నర్సులు భవనాల వెలుపల ఉన్న రోగులకు చికిత్స చేశారు.

మరోవైపు భూకంపం కారణంగా జరిగిన నష్టాన్ని థాయ్ అధికారులు అంచనా వేశారు. భూకంపం ధాటికి బ్యాంకాక్, చియాంగ్ రాయ్, ఫ్రే, మే హాంగ్ సన్, లాంపాంగ్, చాయ్ నాట్, లాంఫున్, లోయి, సముత్ సఖోన్, చియాంగ్ మై ,కాంఫెంగ్ ఫెట్ సహా 10 ఇతర ప్రావిన్సులలో ఊహించని నష్టాన్ని కలిగించిందని విపత్తు నివారణ,ఉపశమన విభాగం డైరెక్టర్ జనరల్ పసకార్న్ బూన్యాలక్ తెలిపారు.