డ్రెస్ చించేసి.. ఫోను పగలగొట్టి.. హోంగార్డును పచ్చి బూతులు తిట్టిన మహిళ

హైదరాబాద్ లోని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి(ఫిబ్రవరి 24) ఓ మహిళ రచ్చ రచ్చ చేసింది. హోంగార్డుకు చుక్కలు చూపించింది. రాంగ్ రూట్లో రావడమే కాకుండా అడ్డుకున్న హోంగార్డుపై బూతులు తిడుతూ రెచ్చిపోయింది.

హోంగార్డ్ డ్రెస్ ను చింపడమే కాకుండా.. ఫోను పగలగొట్టింది. ఆ మహిళ రెడ్ డ్రెస్ లో జాగ్వర్ కారులో వచ్చిందని... అయితే ఆమె నడిపిన కారు గుండాల శ్రీలత అనే పేరుపై రిజిస్టర్ అయి ఉందని తెలిపారు పోలీసులు. కారు ఆమెది కాదని.. ఆ మహిళకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నాయని పేర్కొన్నారు. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆ మహిళపై కేసు నమోదు అయినట్లు తెలిపారు పోలీసులు.