పిల్లల కాలేజీ ఫీజులకు డబ్బుల్లేక .. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య

పిల్లల కాలేజీ ఫీజులకు డబ్బుల్లేక .. మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
  • తల్లి మృతిని తట్టుకోలేక కొడుకు సూసైడ్​

 ఎల్బీనగర్, వెలుగు: పిల్లల కాలేజీ ఫీజులు, ఆర్థిక ఇబ్బందులు భరించలేక ఓ మహిళ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. తల్లి మృతిని తట్టుకోలేక ఆమె పెద్ద కొడుకు సూసైడ్​ చేసుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్​లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్​లోని ఒంగోలుకు చెందిన గుంజి శివ(42) తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి గత కొన్నేండ్ల నగరానికి వచ్చాడు. కొత్తపేటలోని ఎస్ఎల్ఆర్ కాలనీలో నివాసం ఉంటున్నారు.  శివ గత కొన్ని నెలల క్రితమే ఆనారోగ్యంతో మృతి చెందాడు.

దీంతో అప్పటి నుంచి కుటుంబ భారం శివ భార్య పద్మ(38)పై పడింది. పెద్ద కొడుకు గుంజి వంశీ (18) ఇంటర్ పాసయ్యాడు. చిన్న కొడుకు ఇంటర్ ఫస్ట్ ఇయర్(16)  చదువుతున్నాడు. కాగా, భర్త మరణం.. ఆర్థిక ఇబ్బందులతోపాటు పిల్లల చదువులకు డబ్బులు లేకపోవడంతో పద్మ మనస్థాపం చెందింది. ఈ క్రమంలో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నది. తల్లిని ఆ స్థితిలో చూసి షాక్ అయిన పెద్ద కొడుకు వంశీ.. తాను కూడా ఉరేసుకొని సూసైడ్​ చేసుకున్నాడు.  స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారిద్దరి మృతదేహాలను పోలీసులు ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.