లోకల్ ట్రైన్కు వేలాడుతూ యువతి ప్రయాణం.. ఇంత రిస్క్ అవసరమా తల్లీ..

లోకల్ ట్రైన్కు వేలాడుతూ యువతి ప్రయాణం.. ఇంత రిస్క్ అవసరమా తల్లీ..

దేశ ఆర్థిక రాజధాని ముంబైలో  నిత్యం వేలాది మంది లోకల్  రైళ్లలో ప్రయాణిస్తుంటారు. కొన్సి సార్లు ఇసుకేస్తే రాలనంత జనం లోకల్ రైళ్లలో వెళ్తుంటారు. ఈ సమయంలో కనీసం నిలబడేందుకు కూడా స్థలం లేని పరిస్థితి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లోనే ఓ మహిళ ముంబై లోకల్ రైల్లో ప్రమాదకరంగా ప్రయాణించింది. విపరీతమైన రద్దీ కారణంగా రైలు ఫుట్ బోర్డుపై అమ్మాయి ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అయింది. 

22 సెకన్ల వీడియోలో ముంబై లోకల్ రైళ్లో డోర్ వద్ద ఓ అమ్మాయి వేలాడుతూ కనిపించింది. రైలు స్టార్ట్ అవ్వగానే ఆమె ఫుడ్ బోర్డుపై కాళ్లు పెట్టి ప్రయాణించింది. ప్రాణాలు పణంగా పెట్టి అమ్మాయి ప్రయాణిస్తుండటంపై భయాందోళన వ్యక్తం చేశారు. ఇది రిస్కీ ప్రయాణం అని కొందరు..ఇంత రద్దీ ఉన్న ట్రైన్ లో ప్రయాణించడం అవసరమా అని మరి కొందరు కామెంట్ చేశారు. 

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆగస్టు 17వ తేదీన పోస్ట్ చేసిన కొద్ది గంటల్లోనే వేల మంది వీక్షించారు. ఈ వీడియోపై భిన్నంగా స్పందించారు. ఓ యూజర్ ఇది భయానక ప్రయాణం అని కామెంట్ చేశాడు. మరో వ్యక్తి అయితే ఆమె పట్టుదలను మెచ్చుకున్నాడు. మరో వ్యక్తి అయితే ముంబైని సందర్శించాలనుకున్న తన కల..ఈ వీడియోతో చనిపోయిందని చెప్పుకొచ్చాడు.