రెస్క్యూ ఆపరేషన్లో మరో అపశృతి.. మహిళ మృతి..

జార్ఖండ్‌ దేవ్ఘడ్ జిల్లాలోని త్రికూట పర్వత రోప్ వే ఘటనలో మరొకరు ప్రాణాలు కోల్పోయారు. రెస్క్యూ ఆపరేషన్ సమయంలో ఇవాళ ఓ మహిళ హెలికాప్టర్ నుంచి జారిపడి మృతి చెందారు. పట్టుతప్పి కింద పడటంతో తీవ్ర గాయాలపాలైన బాధితురాలిని హాస్పిటల్కు తరలించారు. ట్రీట్మెంట్ కొనసాగుతుండగానే ఆమె మృత్యువాత పడ్డారు. చ‌నిపోయిన మ‌హిళ‌ను 60 ఏళ్ల శోభాదేవిగా గుర్తించారు. ఈమెతో కలిపి ఈ ఘటనలో చనిపోయిన వారి సంఖ్య మూడుకు చేరింది.

ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు చెందిన హెలికాప్టర్లతో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్ దాదాపు 45 గంటల పాటు కొనసాగింది. ఇవాళ కేబుల్ కార్స్లో చిక్కుకుపోయిన 15 మందిని రక్షించారు. వారంతా అనారోగ్యం పాలవడంతో హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. మరోవైపు రోప్ వే ఘటనపై సీఎం హేమంత్ సోరెన్ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించారు.

మరిన్ని వార్తల కోసం..

 

రోప్ వే ప్రమాద రెస్క్యూ ఆపరేషన్ క్లోజ్

అక్బరుద్దీన్ కేసులో తీర్పు వాయిదా