ఈఎస్ఐ ఆస్పత్రిలో .. బాలికపై అత్యాచారం

హైదరాబాద్, వెలుగు: సనత్‌‌‌‌నగర్ ఈఎస్ఐ ఆస్పత్రిలో బాలికపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.  పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  సిటీకి చెందిన ఓ పేషెంట్ (మైనర్)కు చేతికి దెబ్బ తగలడంతో ఈఎస్ఐ హాస్పిటల్ పీఎంఆర్ వార్డులో ఫిజియోథెరపీ చేయించుకుంటున్నాడు.  బాలుడి అక్కయ్య(13) అతడికి అటెండర్‌‌‌‌‌‌‌‌గా ఉంది. ఈఎస్ఐ ఆస్పత్రిలో ఫుడ్ సప్లై విభాగంలో పనిచేస్తున్న అజయ్ అనే యువకుడు ఆమెతో పరిచయం పెంచుకున్నాడు.

 Also Raed :- ఎయిడెడ్ స్కూల్స్..మనుగడపై నీలినీడలు

శుక్రవారం రాత్రి ఆమెను నమ్మించి సెకండ్ ఫ్లోర్​లోకి తీసుకెళ్లాడు. ఆమెను బెదిరించి తాను చెప్పినట్లు వినకపోతే చంపేస్తానని నోట్లో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడు.  అనంతరం అక్కడి నుంచి పారిపోయాడు. బాధితురాలు తనపై జరిగిన దారుణాన్ని హాస్పిటల్ సిబ్బందికి చెప్పింది. డాక్టర్లు అక్కడే బాధితురాలికి వైద్య పరీక్షలు చేశారు.  అత్యాచారం జరిగినట్లు నిర్ధారించి ఎస్ఆర్ నగర్ పోలీసులకు సమాచారం అందించారు.  పోలీసులు బాధితురాలి స్టేట్‌‌‌‌మెంట్ రికార్డ్ చేశారు. కేసు ఫైల్ చేసి నిందితుడు అజయ్‌‌‌‌ను అదుపులోకి తీసుకున్నారు.