యూపీ సీఎం యోగికి.. బెదిరింపు కాల్స్ చేసింది ఎవరంటే..

యూపీ సీఎం యోగికి.. బెదిరింపు కాల్స్ చేసింది ఎవరంటే..

యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ను చంపేస్తానని బెదిరింపులకు పాల్పడిన 24 యేళ్ల యువతిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. ఆదివారం (నవంబర్03) ముంబైలోని థానేలో బెదిరింపు కాల్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితురాలు ఫాతిమా ఖాన్ ను అరెస్ట్ చేశారు. 

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో బీఎస్సీ చేసిన ఫాతిమా ఖాన్ .. మహారాష్ట్రలో థానే జిల్లాలోని ఉల్హాస్ నగర్ ప్రాంతంలో ఉంటోంది. ఆమె తండ్రి కలప వ్యాపారం చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

10 రోజుల్లోగా సీఎం పదవికి ఆదిత్యానాథ్ రాజీనామా చేయకపోతే.. ఎన్ సీపీ నేత బాబా సిద్ధిఖ్ లా చంపేస్తానని ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సాప్ నంబర్ కు శనివారం ఓ గుర్తు తెలియని నంబర్ నుంచి వచ్చిన మెసేజ్ కలకలం రేపింది. విచారణలో ఫాతిమా ఖాన్ మెసేజ్ పంపినట్టు పోలీసులు నిర్ధారించారు. అయితే ఫాతిమా ఖాన్  మానసిక స్థితిలో బాగోలేదని పోలీసులు తెలిపారు.