
పెళ్లికి ముందు ఇచ్చేది బ్యాచిలర్ పార్టీ. పుట్టిన రోజున ఇచ్చేది బర్త్ డే పార్టీ. వీకెండ్స్ చేసుకునేది వీకెండ్ పార్టీ అంటారు. మరి చనిపోయే ముందు చేసుకునే పార్టీని ఏమంటారో తెలుసా. ఏంటీ చనిపోయే ముందు పార్టీ చేసుకుంటారా..ఇదెక్కడి విడ్డూరం అని అనుకుంటున్నారా..? అవును. ఓ మహిళ తను చనిపోతున్నానని తెలిసి..కుటుంబ సభ్యులు,బంధువులు, స్నేహితులతో కలిసి సజీవ అంత్యక్రియల పార్టీ ఇచ్చింది. వివరాల్లోకి వెళ్తే..
సజీవ అంత్యక్రియల పార్టీ..
అమెరికాలో నివసించే హెడీ సాటర్త్ వైట్ అనే మహిళ అరుదైన క్యాన్సర్ తో బాధపడుతోంది. ఆమెకు 34 ఏళ్ల వయసులోనే మైలోడిస్ప్లాస్టిక్ సిండ్రోమ్ అనే అరుదైన క్యాన్సర్ సోకింది. దీంతో ఎక్కువకాలం బతకవు. ఎప్పుడైనా చనిపోవచ్చు అని డాక్టర్లు హెడీకి వెల్లడించారు. దీంతో ఆమెకు తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో పార్టీ చేసుకోవాలని..వారందరికి పార్టీ ఇవ్వాలని అనుకుంది. ఈ విషయాన్ని తన సోదరి జెన్నా సాటర్త్ వైట్ కు తెలిపింది. దీంతో సోదరి కోరిక తీర్చేందుకు జెన్నా సాటర్త్ వైట్ ..భారీ పార్టీని ఏర్పాటు చేసింది. హెడీ సాటర్త్ వైట్ స్నేహితులను, ముఖ్యులు, బంధువులు, కుటుంబ సభ్యులను అందరిని ఈ పార్టీకి పిలిచింది. దాదాపు 200 మంది లైఫ్ ఫేర్ వల్ పార్టీకి హాజరయ్యారు.
బాధను మర్చి..ఆనందంగా..
తన స్నేహితులు, కుటుంబ సభ్యులు, బంధువులతో హెడీ సాటర్త్ వైట్ ఫుల్ గా ఎంజాయ్ చేసింది. చనిపోతున్నానన్న బాధను మర్చి డ్యాన్సులతో హోరెత్తించింది. పటాకులు కాల్చింది. తన భర్తతో కలిసి వివాహ సమయంలో డ్యాన్స్ చేసిన పాటకు డ్యాన్స్ చేసింది. అనంతరం కొద్ది రోజుల్లోనే హెడీ సాటర్త్ వైట్ చనిపోయింది. ఈ ఘటన 2018లో జరిగింది.
ALSO READ :డైలీ ఫుడ్ లో ప్రొటీన్లు ఉండేలా చూసుకోవాలి.. ఎందుకంటే
తన సోదరికి సజీవ అంత్యక్రియల పార్టీ నిర్వహించినట్లు జెన్నా సాటర్త్ వైట్ బీబీసీ ద్వారా వెల్లడించింది. BBCలో ఉమెన్స్ అవర్ కార్యక్రమంలో మాట్లాడిన జెన్నా..హెడీ కోరిక మేరకు సజీవ అంత్యక్రియల పార్టీని ఏర్పాటు చేసినట్లు చెప్పింది. హెడీ మరణించడం బాధాకరమైందని..అయితే పార్టీలో కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులతో కలిసి ఆనందంగా గడిపిందని చెప్పుకొచ్చింది. తన జీవితాన్ని సంతోషంగా ముగించిందని వివరించింది.