ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో ఓ పోలీస్ అధికారి మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. నడి రోడ్డుపై ఆమెను కాలితో తన్నాడు. పోలీస్ అధికారి దురుసు ప్రవర్తనతో ఆగ్రహించిన మహిళ..ఆయన్ను చెప్పుతో కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంతకు ఆ పోలీస్ అధికారి మహిళను కాలితో ఎందుకు తన్సాల్సి వచ్చింది. మహిళ పోలీస్ అధికారిని చెప్పుతో కొట్టడానికి గల కారణాలేంటి...? వివరాల్లోకి వెళ్తే...
ఉత్తర్ ప్రదేశ్ లోని మథురలో అక్టోబర్ 2వ తేదీన ఆటోలో ఇంటికి వెళ్తోంది. అయితే పానిగావ్ లింక్ రోడ్ నుంచి కైల్సా నగర్ కు వచ్చే మలుపు దగ్గర పోలీస్ అధికారి మహిళ వెళ్తున్న ఆటోను ఆపాడు. ఈ సమయంలో ఆ మహిళ పట్ల పోలీస్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆగ్రహించిన మహిళ..పోలీస్ ను చెప్పుతో కొట్టింది.
ALSO READ: ఢిల్లీలో భారీ భూ ప్రకంపనలు : ఊగిపోయిన బిల్డింగ్స్.. బయటకు పరుగులు
మహిళ తనను చెప్పుతో కొట్టడంతో పోలీస్ అధికారి కూడా స్పందించారు. మహిళను తన్ని నెట్టేశాడు. ఈ సమయంలో అక్కడే ఉన్న మరో పోలీస్ ..పోలీస్ అధికారిని ఆపాడు. పోలీస్, మహిళ మధ్య జరిగిన ఈ గొడవను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది.
यूपी पुलिस: महिला को पुलिस कर्मी लात मार रहा और महिला चप्पल जड़ रही है...।
— Dilip Singh (@dileepsinghlive) October 2, 2023
ये वायरल वीडियो मथुरा का बताया जा रहा है, महिला सुरक्षा की बीच चौराहा धज्जियां उड़ाई जा रही है...।
वाया-@rishabhmanitrip pic.twitter.com/LcfEL3titt
పోలీసు అధికారి దురుసు ప్రవర్తన పట్ల బాధిత మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు..పోలీస్ అధికారిని సస్పెండ్ చేశారు. విచారణ చేపట్టారు. విచారణ అనంతరం అతనిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.