మిస్టరీ ఏంటీ : రైలు పట్టాలపై శవంగా.. ఇంటెలిజెన్స్ బ్యూరో మహిళా అధికారి..!

మిస్టరీ ఏంటీ : రైలు పట్టాలపై శవంగా.. ఇంటెలిజెన్స్ బ్యూరో మహిళా అధికారి..!

తిరువనంతపురం: ఇంటెలిజెన్స్ బ్యూరో(IB) అధికారిణి అనుమానాస్పద మృతి కలకలం రేపింది. తిరువనంతపురం ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ విభాగం  ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిణి మేఘ చక్క సమీపంలో రైల్వే ట్రాక్ పై అనుమానాస్పద స్థితిలో చనిపోయింది.మేఘ ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. ప్రాథమిక దర్యాప్తులో ఆత్మహత్య  కేసుగా భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్194 కింద కేసు నమోదు చేశారు. 

ఫోరెన్సిక్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన మేఘ..8నెలల క్రితం తిరువనంతరపురం ఇంటర్నేషన్ ఎయిర్ పోర్టులో ఇమ్మిగ్రేషన్ విభాగంలో ఇంటెలిజెన్ష్ బ్యూరోగా ఉద్యోగం పొందారు. ఎప్పుడూ సైలెంట్గా, సంయమనంతో ఉండే మేఘ మృతి పలు అనుమానం ఉందని ఆమె కుటుంబసభ్యులు తెలిపారు.చక్కాలో ఆమె కార్యాలయం సమపీంలో నివాసం ఉంటున్నారు.మేఘ మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం తిరువనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆస్పత్రికి తరలించారు.