హైదరాబాద్‌లో సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ఇవాళ (శుక్రవారం) ట్రైనీ ఐపీఎస్‌ల పాసింగ్ ఔట్ పరేడ్ జరిగింది. ఈ పాసింగ్ ఔట్ పరేడ్‌కు జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్.. ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న 149 మంది ట్రైనీ ఐపీఎస్‌లు వాళ్లకు కేటాయించిన రాష్ట్రాల్లో సర్వీస్ చేయనున్నారు. ఇవాళ జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్‌లో ఐపీఎస్‌లను లీడ్ చేసే పరేడ్ కమాండర్‌గా మహిళా ట్రైనీ ఐపీఎస్ దర్పన్ అహ్లూవాలియా లీడ్ చేశారు. ఇలా మహిళా కమాండర్ పరేడ్‌ను ముందుండి నడిపించడం వరుసగా మూడోసారి. కాగా, బ్యాచ్‌లో శిక్షణ పొందిన 149 మందిలో నుంచి తెలంగాణకు నలుగురు ట్రైనీ ఐపీఎస్‌లను, ఏపీకి ఐదుగురు ట్రైనీ ఐపీఎస్‌లను కేటాయించారు.
ఓవరాల్ టాపర్ దర్పన్ అహ్లూవాలియా
ఈ ఏడాది పరేడ్ లీడ్ చేసిన దర్పన్ అహ్లూవాలియా పంజాబ్ కేడర్‌కు చెందిన ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్. ఈమె ట్రైనింగ్‌లో బేసిక్ కోర్స్ ఫేజ్ 1లో బ్యాచ్ టాపర్‌గా నిలిచారు. కాగా, గత ఏడాది పరేడ్ కమాండర్‌గా రంజితా శర్మ వ్యవహరించారు. ఆమె రాజస్థాన్ కేడర్‌కు చెందిన ఆఫీసర్ కాగా, అంతకు ముందు ఏడాది పరేడ్‌ను లీడ్ చేసిన డీవీ కిరణ్ శ్రుతి తమిళనాడు కేడర్ ఆఫీసర్‌గా ఉన్నారు.
తెలంగాణకు వీళ్లే
ట్రైనీ ఐపీఎస్ స్వరాష్ట్రం
పాటిల్ కాంతీలాల్ మహారాష్ట్ర
సిరిశెట్టి సంకీర్త్ తెలంగాణ
పి. గుప్తా ఢిల్లీ
పరితోష్ పంకజ్ బీహార్