![చెన్నై షాపింగ్ మాల్ బిల్డింగ్ పై నుంచి దూకి మహిళ ఆత్మహత్య..](https://static.v6velugu.com/uploads/2024/02/woman-jumped-from-chennai-shopping-mall-building-in-kukatpally_Jgm9BxEepI.jpg)
హైదరాబాద్: కూకట్ పల్లి వై జంక్షన్ లోని ది చెన్నై సిల్క్స్ షాపింగ్ మాల్ లో విషాద సంఘటన చోటుచేసుకుంది. హౌస్ కీపింగ్ విభాగంలో గత నాలుగు సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న రమణమ్మ (50) అనే ఉద్యోగి ఫిబ్రవరి 5వ తేదీ సోమవారం షాపింగ్ మాల్ 2వ అంతస్తుపై నుండి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. హౌస్ కీపింగ్ కి లో పనిచేసే వారు కొంతకాలంగా వేధింపులకు గురి చేస్తున్నారని రమణమ్మ కూతురు జాష్ణవి ఆరోపించింది.
ఆదివారం రాత్రి కూడా షాపింగ్ మాల్ లో ఇదే తంతు జరిగినట్లు ఆమె వెల్లడించింది. రోజు వెళ్తున్నట్లు గానే ఈరోజు కూడా డ్యూటీకి వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడిందని ఆమె తెలిపింది. రమణమ్మ ఆత్మహత్యకు పాల్పడే అవకాశం లేదని... చెన్నై షాపి లో పనిచేసే వారి వల్లే జరిగిందని ఆరోపించింది. దీనిపైన వారు స్పందించకపోగా ఎటువంటి సమాధానం చెప్పడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రమణమ్మ.. ఆత్మహత్యకు పాల్పడే ముందు తన కొడుకుకు వాయిస్ రికార్డు పంపి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న కూకట్ పల్లి పోలీసులు.. ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు సేకరించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.