హైదరాబాద్లో లారీ ఢీకొని మహిళ మృతి 

కూకట్​పల్లి : హైదరాబాద్  బాలానగర్ పీఎస్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. స్కూటీని లారీ ఢీకొనడంతో మహిళ మృతి చెందింది. బాలానగర్​లోని లైఫ్​స్పేస్​అపార్ట్​మెంట్​లో ఉండే సంతోషిదేవి జైన్​(54) తన కూతురు పూజ, మనవరాలు కుష్బూ(8)తో కలిసి సోమవారం మధ్యాహ్నం స్కూటీపై ఫతేనగర్​కు వెళ్తున్నారు. పూజ డ్రైవింగ్​ చేస్తుండగా, సంతోషిదేవి వెనక, బాలిక మధ్యలో కూర్చుంది.

బాలానగర్ ఫ్లైఓవర్​ పిల్లర్ నంబర్​11 వద్ద  లారీ  ఢీ కొట్టడంతో ముగ్గురూ కిందపడ్డారు. ఆపై లారీ డ్రైవర్​ఆపకుండా వెళ్లడంతో టైర్​సంతోషిదేవి తలపై నుంచి వెళ్లి స్పాట్​లోనే మృతి చెందింది. అదృష్టవశాత్తు తల్లీకూతుర్లు పూజ, కుష్బూకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.