
- పెద్దపల్లి జిల్లా కేంద్రంలో దారుణం
పెద్దపల్లి, వెలుగు : ఓ మహిళ తన మూడేండ్ల కూతురి చంపి తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే... కరీంనగర్ జిల్లా వెదిర గ్రామానికి చెందిన సాహితి (25)కి జూలపల్లికి చెందిన వేణుగోపాల్‌రెడ్డితో నాలుగేండ్ల కింద వివాహమైంది. వీరికి రసన్య (3) కూతురు ఉంది. వేణుగోపాల్‌రెడ్డి ఎల్‌ఐసీలో పనిచేస్తుండగా.. పెద్దపల్లిలో ఇల్లు కిరాయికి తీసుకొని ఉంటున్నారు. బుధవారం ఉదయం వేణుగోపాల్‌రెడ్డి పని మీద జగిత్యాల వెళ్లాడు. మధ్యాహ్నం సాహితికి ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. జగిత్యాలలో పని ముగించుకొని రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకున్న వేణుగోపాల్‌రెడ్డికి భార్య, కూతురు చనిపోయి కనిపించారు.
దీంతో చుట్టుపక్కల వారితో పాటు పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వారు ఘటనాస్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. కాగా.. సాహితి కూతురిని గొంతు నులిమి హత్య చేసిన అనంతరం తాను కూడా ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. తన చావుకు ఎవరూ కారణం కాదంటూ సాహితి సూసైడ్ నోట్ రాసినట్లు తెలుస్తోంది. మృతురాలు కొంతకాలంగా మెంటల్‌గా ఇబ్బంది పడుతున్నట్లు బంధువులు తెలిపారు. సంఘటనాస్థలాన్ని ఏసీపీ కృష్ణ, సీఐ ప్రవీణ్‌కుమార్, ఎస్సై లక్ష్మణ్‌రావు పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు
తెలిపారు.