ఆలస్యంగా వచ్చిన కూతురు.. ప్రశ్నించిన తండ్రిని చంపేసింది


ఇంటికి లేటుగా ఎందుకొచ్చావ్.. ఇంత సేపు ఎక్కడికి వెళ్లావ్.. ఏం చేస్తున్నావ్.. ఫోన్ చేసినా స్పందించవు.. ఇంట్లో వాళ్లకు కంగారు ఉంటుంది కదా.. ఇంటికి రావటానికి ఆలస్యం ఎందుకు అయ్యిందో చెప్పు అంటూ ప్రశ్నించిన కన్న తండ్రిని చంపేసింది ఓ కూతురు.

దేశవ్యాప్తంగా కలకలం రేపిన ఈ ఘటన హైదరాబాద్ అంబర్ పేటలో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నిఖిత అనే మహిళ అఫ్జల్‌గంజ్‌లోని ఒక దుకాణంలో పండ్లు అమ్ముతూ...  కుటుంబంతో సహా తులసీరాంనగర్ అంబర్‌పేట్‌లో ఉంది. గత కొన్ని రోజుల నుంచి నిఖిత అర్థరాత్రి ఇంటికి తిరిగి లేటుగా  వస్తుండడంతో ఆమె తండ్రి ఆమెను మందలించాడు.

దీంతో కన్న  తండ్రి అని కూడా చూడకుండా గొంతు కోసింది నిఖిత. దీంతో అతన్ని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ 2023 జూలై 30 ఆదివారం తెల్లవారుజామున మృతి చెందాడు. 

దీనిపై అంబర్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. నిఖితను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.