వావివరసలు మరిచిన కొడుకు.. నరికి ముక్కలు చేసిన తల్లి.. ఏపీలో ఘటన

వావివరసలు మరిచిన కొడుకు.. నరికి ముక్కలు చేసిన తల్లి.. ఏపీలో ఘటన

నవ మాసాలు మోసి కని పెంచిన తల్లి.. కన్న కొడుకునే హతమార్చిన ఘటన ఏపీలో వెలుగు చూసింది. చెట్టంత కొడుకు వృద్ధాప్యంలో అండగా ఉంటాడని భావించిన ఆ తల్లికి.. అతని చెడు వాట్లు, బంధువుల పట్ల మృతుడి తీరు అంత విసుగు పుట్టించాయి.

వివరాల్లోకి వెళ్తే.. కంభం పట్టణంలోని మేదరవీధిలో కడం లక్ష్మి దేవి(57)కు నివాసం ఉంటోంది. ఈమెకు నలుగురు కుమారులు సంతానం. వీరిలో ఇద్దరికి పెళ్లవ్వగా.. మరో ఇద్దరు పెళ్లీడుకొచ్చారు. మూడో కొడుకు శ్యామ్ ప్రసాద్ (35) లారీ డ్రైవర్‌. మద్యం, చెడు అలవాట్లకు బానిసైన ఇతడు ఇంటీమీదకు తేని గొడవల్లేవు. జల్సాల కోసం చోరీలు చేశాడు.. దొంగతనాలకు వెళ్లి దొరికిపోయి దెబ్బలు తిన్నాడు. అయినప్పటికీ, ఆ తల్లి అతన్ని మందలించిందే కానీ, తిండి పెట్టకుండా కొడుకు కడుపు కాల్చిన రోజు లేదు. 

రోజులు గడుస్తున్న కొద్దీ శ్యామ్ ప్రసాద్ మరింత శృతి మించాడు. బంధువుల మహిళతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలుపెట్టాడు. ఇటీవల అతడు బెంగళూరు, ఖమ్మం, హైదరాబాద్‌లోని అత్తలు, ఇతర బంధువుల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. వారి నుంచి ఫోన్లు తల్లికి ఎక్కువయ్యాయి. సొంతూరులో తలెత్తుకు తిరగలేని పరిస్థితి. ఇక లాభం లేదనుకున్న ఆ తల్లి బంధువుల సాయంలో అతన్ని హతమార్చింది. అనంతరం మృతదేహాన్ని ఐదు ముక్కులుగా కోసి.. వాటిని మూడు బస్తాలలో నింపి గ్రామ సమీపంలోని కాలువలో పడేసింది. 

దుర్వాసన, శరీర భాగాలను కుక్కలు పీక్కుతినడం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శ్యామ్‌ ప్రసాద్ కనిపించకపోవడం.. మృతదేహం ఆనవాళ్లు పరిశీలించిన పోలీసులు దాన్ని శ్యామ్‌దిగా గుర్తించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితులపై బిఎన్‌ఎస్ సెక్షన్లు 103(1), 238 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వారి కోసం గాలిస్తున్నారు.