సమాధిలో మహిళ కాళ్లు, చేతులు, పుర్రె మాయం

సంగారెడ్డి జిల్లాలో వింత ఘటన చోటుచేసుకుంది. సమాధిని తవ్వి మహిళ పుర్రెను దొంగిలించారు కొంతమంది దుండగులు. ఈ ఘటన రాయికోడ్ మండల పరిధిలోని మహబాత్ పూర్ గ్రామ శివారులో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కొనింటి ఏలిశా బెతూ అనే మహిళ మూడు సంవత్సరాల క్రితం అనారోగ్యంతో మృతిచెందింది. ఆమె సమాధిని గుర్తు తెలియని దుండగులు శుక్రవారం రాత్రి తవ్వి కాళ్లు, చేతులు, తల పుర్రె ఎముకలను తీసుకెళ్లినట్లు కుటుంబసభ్యులు, గ్రామస్థులు గుర్తించారు. అయితే దుండగులు దొరకకుండా తప్పించుకునేందుకు సమాధి చుట్టూ కారంపొడి చల్లి వెళ్ళారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

For More News..