డిజిటల్ యుగంలో ఆన్ లైన్ స్కామ్ లు పెరిగిపోతున్నాయి. రోజుకో తీరుగా మోసాలకు పాల్పడుతున్నారు ఆన్ లైన్ స్కామర్లు..బాధితుల ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. తాజాగా 57ఏళ్ల ఓ మహిళ ఆన్ లైన్ ట్రేడింగ్ మోసానికి గురై రూ. 1.32 కోట్లు పోగొట్టుకుంది.
కేరళకు చెందిన ఈ మహిళ.. స్టాక్ట్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనుకుంది.. ఇందుకోసం సలహాలకోసం ఆన్ లైన్ లో వెతికడం.. ఫ్రాడస్టర్లకు చిక్కడం.. ఖాతా ఖాళీ చేసుకోవడం చూస్తుండగానే జరిగిపోయింది. తిరువనంతపురంలోని శ్రీకార్యం కు చెందిన మహిళ..వాట్సాప్ మేసేజ్ తో ఆన్ లైన్ ట్రేడింగ్ మోసానికి గురై రూ. 1.32కోట్లు పోగొట్టుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
బాధిత మహిళ ఆన్ లైన్ ట్రేడింగ్ చిట్కాలు వెతుకుతుండగా.. ఆమె వాట్సాప్ నంబర్ కు ఓ మేసేజ్ లింక్ వచ్చింది. అది చట్టబద్దమైన మేసేజ్ అని నమ్మిన ఆ మహిళ.. స్కామర్ సూచనలను పాటిస్తూ.. మొబైల్ అప్లికేషన్ ను డౌన్ లోడ్ చేసుకుంది..తక్కువ పెట్టుబడితో ట్రేడింగ్ ప్రారంభించింది..మొదట రిటర్న్ బాగా చూపించారు ఫ్రాడ్ స్టర్లు.. దీంతో అంతా బాగానే ఉందని నమ్మిన బాదిత మహిళ పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టింది.
Also Read :- ప్రపంచంలోనే అతిపెద్ద డేటా సెంటర్ నిర్మిస్తున్న అంబానీ
లాభాలు కూడా బాగానే పెరిగినట్టు యాప్ లో చూపించింది. అయితే కూడబెట్టిన డబ్బు విత్ డ్రా చేయలేకపోవడంతో స్కామర్లను నిలదీసింది.. అయితే ఇప్పుడు ఫండ్స్ బ్లాక్ చేయకుండా ఇంకా డబ్బులు పెట్టుబడి పెట్టాలని మోసగాళ్లు చెప్పారు. వారిమాటలు విన్న ఆమె దాదాపు రూ. 1.32 కోట్ల పెట్టుబడి పెట్టింది. కొద్ది కాలం తర్వాత ఆమె మోసపోయినట్లు గుర్తించింది. పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఇటువంటి ఆన్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. తెలియని WhatsApp లేదా ఇతర మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా పంపబడిన లింక్‌లపై క్లిక్ చేయొద్దని హెచ్చరించింది.