![ప్రియుడితో పారిపోయిన భార్యకు పెళ్లి చేసిన భర్త](https://static.v6velugu.com/uploads/2023/07/Woman-marries-her-brother-_tVx9hLaBGY.jpg)
ప్రియుడితో కలిసి పారిపోయిన భార్యకు పెళ్లి చేశాడు ఓ భర్త. ఈ ఘటన ఒడిశా రాష్ట్రంలో చోటు చేసుకుంది. సోన్‌పూర్ జిల్లా శుభలాయి ఠాణా పరిధిలోని కిరాసి గ్రామానికి చెందిన మాధవ ప్రధాన్ కు మూడేళ్ల క్రితం అనుగుల్ ప్రాంతానికి చెందిన జిల్లితో పెళ్లైయింది. అయితే జిల్లికి తన దూరుపు బంధువైన పరమేశ్వర ప్రధాన్‌తో సన్నిహితంగా ఉంటుంది.
ఇటీవల అతనితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది జిల్లి. ఈ క్రమంలో తన భార్య కనిపించడం లేదంటూ మాధవ ప్రధాన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు వారిని గాలించి పట్టుకుని పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చారు.
అయితే పోలీస్ స్టేషన్ లో జిల్లి తాను పరమేశ్వర్ ప్రధాన్‌తో ఉంటానని, అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మాధవ ప్రధాన్ వారిద్దరికి దగ్గరుండి పెళ్లి చేశాడు.