జస్ట్ మిస్.. డోర్ తెరవగానే పెద్ద పులి.. మహిళ ఏం చేసిందంటే..

జస్ట్ మిస్.. డోర్ తెరవగానే పెద్ద పులి.. మహిళ ఏం చేసిందంటే..

పొద్దున్నే లేచి.. అలా తలుపు తీయగానే ఎదురుగా పెద్దపులి ఉంటే మీరేం చేస్తారు..? ఓ మహిళకు ఇటీవల ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ ప్లేస్ లో మీరే ఉంటే ఏం చేసేవారు అంటూ ప్రశ్నలు.. నెటిజన్ల జవాబులతో ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో చక్కర్లు కొడుతోంది. 

నేచర్ ఈజ్ అమేజింగ్ (Nature is Amazing) అనే ఎక్స్ (ట్విట్టర్) అకౌంట్ లో ‘డోర్ ఓపెన్ చేసిన మహిళ ప్లేస్ లో మీరే ఉంటే ఏం చేసేవారు’ అనే టైటిల్ తో ఈ వీడియో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో మహిళ డోర్ ఓపెన్ చేయగానే టైగర్ కనిపిస్తుంది. తలుపు తీయగానే మహిళ వైపు తదేకంగా చూస్తూ నిలబడి ఉంటుంది పులి. డోర్ పూర్తిగా తీస్తుందమే అన్నట్లుగా చూస్తున్న టైగర్ ను చూసి.. రెండు మూడు సెకన్లలో తలుపు మూసేస్తుంది ఆ మహిళ. ఇంటర్నెట్ లో ఈ వీడియో చూసిన వాళ్లు ‘హమ్మయ్య బతికి పోయింది’ అని ఊపిరి పీల్చుకుంటున్నారు. 

ఆ ప్లేస్ లో మీరే ఉంటే ఏం చేసేవారు అనే ప్రశ్నకు నెటిజన్లు ఒక్కొకరు ఒక్కో రకంగా స్పందిస్తున్నారు. 29 మిలియన్ల వ్యూస్ ట్రెండింగ్ లో ఉన్న ఈ వీడియోను చూసి చాలా మంది కామెంట్స్ వర్షం కురిపించారనుకోండి. వీడియో చూసిన ఒక నెటిజన్ ‘అది కామ్ గా ఉంది.. అంటే పెంపుడు పులి కావచ్చు’ అని కామెంట్ చేయగా.. ‘అది పెట్ టైగర్ లా లేదు.. చాలా భయంకరంగా కనిపిస్తుంది’ అని మరొకరు కామెంట్ చేశారు. ‘నేనే అయితే ఆ టైగర్ ను చూడంగనే అలాగే బిగుసుకుపోయి ఉండేవాడిని.. తర్వాత ఏం జరిగేదే ఊహించుకోలేను’ అని ఒకరు.. ‘అద్భుతమైన టైగర్.. కానీ దగ్గర్నుంచి చూడటం అంటే చాలా కష్టం’ అని కామెంట్స్ చేశారు.