జగిత్యాల జిల్లాలో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా ఓ మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆపరేషన్ కు ముందుకు ఇచ్చే మత్తు మందు వికటించి మహిళ మృతిచెందింది. దీంతో ఆస్పత్రి ఎదుట మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రితో మత్తు మందు వికటించి మహిళ మృతిచెందిన ఘటన గురువారం (సెప్టెంబర్ 19) చోటు చేసుకుంది. మల్యాల మండల కేంద్రానికి చెందిన వంగల మహిత(34) గత కొంత కాలంగా గర్భసంచి ఇన్ ఫెక్షన్ తో బాధపడుతోంది. దీంతో నొప్పి ఎక్కవ కావడంతో మూడు రోజుల క్రితం జగిత్యాల జిల్లా కేంద్రంలోని శాంతి హస్పాటల్ లో చికిత్స అడ్మిట్ అయింది.
గురువారం మధ్యాహ్నం ఆపరేషన్ చేసేందుకు ముందు మత్తు మందు ఇచ్చారు డాక్టర్లు. థియేటర్ కు తీసుకెళ్తుండగా మహిత మృతిచెందింది. దీంతో బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. బాధితురాలి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. మృతురాలికి భర్త రమేష్, 13 ఏళ్ల కూతురు మైథిలి 12 ఏళ్ల కొడుకు ఉన్నారు.
ఈ ఘటనపై సమాధిత ఆసుపత్రికి వైద్యులు చెపుతున్నది మరోలా ఉంది..సర్జరీ సమయంలో హార్ట్ ఎటాక్ వచ్చి మృతి చెందినట్లు చెబుతున్నారు.