ఓ ట్విట్టర్ యూజర్ షేర్ చేసిన మసాలా మ్యాగీ న్యూడిల్స్ కొనుగోలు ఇన్వాయిస్ చిత్రం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఎయిర్ పోర్టులో ఓ చిన్న మ్యాగీ కొన్న సెజల్ సుద్ అనే కస్టమర్.. ధరలపై అసహనం వ్యక్తం చేస్తూ ఇన్ వాయిస్ పోస్ట్ చేసింది. చాలాచోట్ల రూ. 50లు ఉండే మ్యగీకి ఎయిర్ పోర్టులో 193రూపాయలకు కొనుగోలు చేయాల్సి వచ్చింది. దాదాపు నాలుగు రెట్లు ఎక్కువ కస్టమర్లనుంచి వసూలు చేస్తున్నారు.. దీనిపై ఎలా స్పందించాలో కూడా తెలియడం లేదు అని పోస్ట్ చేసింది. ఎవరైనా మ్యాగీ లాంటి వాటిని ఇంత ఎక్కువ ధరకు ఎందుకు విక్రయిస్తారు’ అని సెజల్ సుద్ ఆవేదన వ్యక్తం చేసింది.
ALSOREAD :సఫాయి కార్మికుడి అవతారం ఎత్తిన మరో సర్పంచ్
సెజల్ సుద్ పోస్ట్‌పై స్పందించిన నెటిజన్లు.. ‘‘ఈమ్యాగీ విమాన ఇంధనంతో తయారు చేసిందా ఏంటీ ’’ అంటూ వ్యంగ్యంగా రీట్వీట్ చేశారు. ‘‘బహుశా మీరు ఎయిర్ పోర్టులో కొనుగోలు చేసిన అతి తక్కువ ధర వస్తువు మ్యాగీ అయి ఉండొచ్చు’’ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. మరికొందరు నెటిజన్లు స్పందిస్తూ అధికారులు స్పందించి ఇలాంటి చర్యలకు స్వస్తి పలకాలని కోరారు. ‘‘ఇండిగో విమానాల్లో కూడా మ్యాగీ రూ. 250లకు విక్రయిస్తున్నారు. రేట్లపై పరిమితి విధించాలి’’ అంటూ మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. అయితే ఓ నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ మ్యాగీ ధర రూ. 50 లే అయినప్పటికీ ఎయిర్ పోర్ట్‌లో దీనిని విక్రయించేందుకు డబ్బు చాలా ఖర్చు అవుతుంది.. 5 స్టార్ హోటళ్లలో కూడా ఇలాంటివి జరుగుతుంటాయి. అందుకే మీరు ఈసారి ఎయిర్ పోర్టుకు వెళ్లినప్పుడు టిఫిన్ కట్టుకొని వెళ్లండి” అంటూ హాస్యంగా స్పందించాడు. అయితే ఎయిర్ పోర్టు అధికారులు మాత్రం ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.