లాటరీ తగిలిందని.. షాపింగ్ చేసిన వాళ్లందరి బిల్ కట్టిన సింగర్

లాటరీ తగిలిందని.. షాపింగ్ చేసిన వాళ్లందరి బిల్ కట్టిన సింగర్

షాపింగ్ మాల్‌లో ఏవరికి కావాల్సినవి వాళ్లు కొనుక్కొని.. బిల్ కట్టడానికి కౌంటర్ దగ్గరికి వచ్చారు. వాళ్లెవరి దగ్గరా చిల్లిగవ్వ కూడా తీసుకోవడం లేదు.. రిసిప్ట్ చేతిలో పెట్టి పంపేస్తున్నారు సిబ్బంది. షాక్ అయిన వాళ్లు తమ బిల్ ఎవరు కట్టారా అని తెలుసుకుని, ఒక్కొక్కరుగా వచ్చి ఓ మహిళకు థ్యాంక్స్ చెబుతున్నారు.

లాటరీ తగిలింది.. అందుకే..

అమెరికాలోని కాలిఫోర్నియాలో గత బుధవారం (నవంబరు 27న) వాల్‌మార్ట్ స్టోర్‌లో షాపింగ్‌కి వచ్చినా వాళ్లందరికీ బిల్ కట్టింది ఓ మహిళ. దేవుడికి, ప్రకృతికి, పంటపండించే రైతులకు థ్యాంక్స్ చెబుతూ అమెరికన్లు జరుపుకొనే థ్యాంక్‌గివింగ్ డే (నవంబరు నాలుగో గురువారం) ముందు రోజు ఆమె ఇలా చేసింది. చాలా మంది తమ బిల్స్ ఎందుకు పే చేస్తున్నారని అడిగితే లాటరీ తగిలిందని, బోలెడు డబ్బు రావడంతో ఇలా ఖర్చు పెడుతున్నానని చెప్పిందామె.

పాపులర్ సింగర్.. కానీ చెప్పకుండా..

ఆమె ఓ పాపులర్ సింగర్. కానీ అక్కడున్న చాలా మందికి ఆ విషయం తెలియదు. ఆమె అసలు పేరు.. సియా. అమెరికాలో సెటిల్ అయిన జర్మన్ పాప్ సింగర్. అయితే ఆమె ఎప్పుడు మ్యూజిక్ షో చేసినా ఒక వెరైటీ క్యాప్‌తో ఫేస్ అంతా కవర్ చేసుకుని పాటలు పాడుతుంది. షాపింగ్ మాల్‌లో బిల్లులు కట్టినప్పుడు ఆమె తన పేరు సిసి అని పరిచయం చేసుకుంది. లాటరీలో బోలెడు డబ్బు వచ్చిందని ఓ అబద్ధం చెప్పి.. థ్యాంక్స్‌గివింగ్ డే ముందు ఇలా చారిటీ చేసిందామె.

ఓ అభిమాని గుర్తుపట్టి ట్వీట్.. వైరల్

ఆడ్రీ బక్లెస్ అనే ఓ మహిళ సియా అభిమాని. ఆమె గుర్తుపట్టి ఈ విషయాన్ని ట్వీట్ చేయడంతో ఈ సాయం చేసింది ఫేమస్ పాప్ సింగర్ అని చాలా మందికి తెలియదు. బక్లెస్ ట్వీట్ ఇప్పుడు వైరల్‌గా మారింది. ’సియా నా గ్రోసరీ బిల్ కట్టింది. థ్యాంక్యూ. నువ్వు అందరి బిల్స్ కడుతున్నావు. ఈ సాయం చేస్తోంది నువ్వే అని సీక్రెట్ రివీల్ చేసినందుకు సారీ. కానీ, నీ మంచి హృదయం అందరికీ తెలియాలి’ అని ట్వీట్ చేసింది బక్లెస్.  మరికొంత మంది అభిమానులు కూడా ఇలా ట్వీట్లు చేశారు.