ఇంజినీరింగ్ కాలేజ్ లో మహిళా ప్రొఫెసర్ కు వేధింపులు

ఇంజినీరింగ్ కాలేజ్ లో మహిళా ప్రొఫెసర్ కు వేధింపులు

గండిపేట సీబీఐటీ కాలేజీలో మహిళా ప్రొఫెసర్​ను మానసికంగా వేధిస్తున్న ప్రొఫెసర్లను వెంటనే సస్పెండ్‌‌‌‌ చేయాలని ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది డిమాండ్​ చేశారు. ఈ మేరకు శనివారం కాలేజీలో ఆందోళనకు దిగారు. 23 ఏండ్లుగా కాలేజీలో పనిచేస్తున్న ఓ మహిళా ప్రొఫెసర్​ను ఐక్యూఏఆర్‌‌‌‌ డైరెక్టర్లు సుశాంత్‌‌‌‌బాబు, త్రివిక్రమ్‌‌‌‌రావు కొంతకాలంగా వేధిస్తున్నారని ఆరోపించారు. 

బాధితురాలు పలుమార్లు హెచ్చరించినా వారి తీరు మారడం లేదని, ఇటీవల వేధింపులు మరింత ఎక్కువయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ప్రిన్సిపల్‌‌‌‌ నరసింహ దృష్టికి తీసుకెళ్లగా, ఇలాంటి ఘటనలు కాలేజీలో సర్వసాధారణం అన్నారని ఆరోపించారు. తట్టుకోలేక ప్రిన్సిపల్‌‌‌‌ చాంబర్‌‌‌‌ ముందు ఆందోళనకు దిగామని చెప్పారు. న్యాయం చేయాలని డిమాండ్​చేశారు. సుశాంత్‌‌‌‌ బాబు, త్రివిక్రమ్‌‌‌‌రావుతోపాటు ఇంగ్లీష్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌ హెచ్‌‌‌‌ఓడీ షాగుప్తా పర్వెన్‌‌‌‌ను వెంటనే సస్పెండ్‌‌‌‌ చేయాలని బోధనేతర యూనియన్‌‌‌‌ అధ్యక్షుడు సంజీవ్‌‌‌‌ డిమాండ్‌‌‌‌ చేశారు. చట్టపరమైన చర్యలు తీసుకుని తగిన బుద్ధి చెప్పాలని కోరారు.