చావుబతుకుల్లో కొడుకు.. నీళ్ల ట్యాంక్ ఎక్కి మహిళ ఆందోళన

తన కొడుకు చావుబతుకుల్లో ఉన్నాడని, తమకు న్యాయం చేయాలని ఓ తల్లి నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆందోళన చేసింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా నడిగూడెం మండల కేంద్రంలో చోటుచేసుకుంది. డిసెంబర్ 21వ తేదీ గురువారం మండల కేంద్రంలో పోలీసు అధికారులు తీరును నిరసిస్తూ గుజ్జ అచ్చమ్మ అనే మహిళ.. నీళ్ల ట్యాంక్ ఎక్కి ఆందోళన చేపట్టింది. 

తన కొడుకుపై దుండగులు హత్యయత్నం చేయడంతో చావుబతుకుల్లో ఉన్నాడని కన్నీటి పర్యంతమైంది. ఫిర్యాదు చేసి నెల రోజులు అవుతున్న పోలీసులు పట్టించుకువడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. తమకు న్యాయం జరిగేంత వరకు ఆందోళన విరమించనని పట్టుబట్టడంతో.. ఎస్సై ఏడుకొండలు, సంఘటనాస్థలానికి చేరుకు సర్ది చెప్పడంతో ఆందోళన విరమించింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.